Sunday, November 08, 2009

About 2012

ఈ మద్యనే ఆసక్తి సంతరించుకున్న రెండు వేల పన్నెండు యుగాంతం గురించి చదివి చూశాను.
"మాయా " నాగరికతలో జనాలు తయారు చేసిన క్యాలెండర్లో రెండు వేల పన్నెండు తర్వాత అంకెలు (అదే రోజులు) లేవంట, వాళ్ళది బాగా పెద్ద క్యాలెండరంట ఐదు వేల ఏళ్ళు షెడ్యూల్సుకి సరిపోతుందిట(అందులో తర్వాత అంకెలు తర్వాత వేసుకోవచ్చులే వచ్చే సంవత్సరం క్యాలెండర్ ఇప్పుడే ఎందుకు తయారు చేసుకోవటం ఎందుకు అని వాళ్ళు అనుకుని ఉండొచ్చేమో కదా.. కానీ) మన వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళు ఆ రోజు (డిశెంబర్ ఇరవై ఒకటి) తర్వాత రోజులు ఉన్నా మనుషులకవి అవసరం లేదు కాబట్టే వాళ్ళ క్యాలెండర్ అక్కడితో ఆపేశారు అని.. ఇది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు కానీ మన వాళ్ళకి ఏదైనా విషయం ఎగ్జైటింగుగా ఉంటే చాలా ఇష్టపడతారని నాకు అర్దమైంది.


సుమేరియన్ నాగరికత (ఆరు వేల ఏళ్ళనాటిదంట)లో వాళ్ళు దశమగ్రహాన్ని కనుక్కున్నారంట  (అంటే అల్లుడు కాదు సుమా), దాని పేరు నిబిరూ అంట.. అది భూకక్ష్యలో కొన్ని వేల మైళ్ళ దూరంలో కొన్నేళ్ళకొకసారి పోతుందింట.. ఆ వ్యవధి కూడా మామూలు మనిషి మేధకు అందుతుంది కానీ పరిశీలనా శక్తి అందదంట.. ఔను మరి స్వయంప్రకాశకం కాని దశమగ్రహాలు వంటిదే కదా (గ్రహమే కానీ నక్షత్రం కాదు కదా), దాని ఉనికి నిజమో, పుకారో ఎవరికి తెలుస్తుంది.. ఏదో సుమేరియన్లు చూశారన్న చరిత్ర తప్ప.. అసలు విషయం ఏంటంటే ఆ గ్రహం మన దగ్గరికి వస్తే.. వాటి గురుత్వాకర్షణ (భూమి మరియు నిబిరూ) కారణంగా ఆ రెండూ కౌగిలించుకుంటే వాటి అనురాగానికి నలిగిపోవాల్సింది మనమేనంట.. (నిజమేనంటారా...??) ఆ నిబిరూని గురించి తెలుసుకుంటూంటే ఏ పుట్టలో ఏ పాముందో అన్న సామెత పోయి.. ఏ మూల ఏ గ్రహముందో అనుకోవాల్సొస్తుంది.. ఇంకో విషయం ఏంటంటే ఈ కొలీగ్సిద్దరూ (భూమి మరియు నిబిరూ గ్రహం) కలుసుకునే ఆ ముహూర్తం కూడా మాయా క్యాలెండర్లో తేదీలాగిపోయిన రోజేనంట... ఎవడు చూశాడు... ఒక వేల చూస్తే ఎవడు మిగిలుంటాడు....


నాకు మాత్రం ఈ విశేషాలన్నీ వింటుంటే... థ్రిల్లర్,యాక్సన్ కంబైండ్ నవల పుస్తకాలు డబ్బులివ్వకుండా చదువుతున్నంత హ్యాపీగా ఉంది...







ఈ రెండు వేల పన్నెండు ఉధంతం నిజమవ్వాలని కోరుకుందాం, ఏం షాకిచ్చినట్టుందా... నీకేమో కానీ నాకు మాత్రం అనిపిస్తుంది.. ఎవడు బ్రతుకుతాడు ఒక జీవితకాలం అని...
ఎంజాయ్ ఫేసింగ్ ఎనీథింగ్...


హ్యాపీ లైఫ్ (దో ఇట్ ఈజ్ షార్ట్ / లాంగ్)

4 comments:

  1. lessa palikitiri Mouli garu, vunDedi poyedi pakkana petti santhoshamga gaDipite sari.

    ReplyDelete
  2. every day we do anything just by thought that a fine tommorrow will be there and we do everything for tommorrow. isn't. if not we should be stop eating by now.
    so we will see what's going to happen (if not u, i will).

    ReplyDelete
  3. నువ్వు కోరుకున్నట్టు జరగదు కన్నా!
    యుగాంతం ఎప్పుడు జరుగుతుందో, నీకు చెప్పినవాడికి, అలాగే వాడి తాత, తాత,తాత ...............................................................................................కి అంతే కాకుండా నాసా కి, ఇస్రో కి అంతకంటే తెలిదు కన్నా!
    యుగాంతం నీకు చెప్పి వస్తదా....
    భవిష్యత్తు చెప్పలంటే బైబిలు ఒక్కటే............. బాబు
    ఆ బైబిలులో, 2012 డిసెంబర్ 21 యుగాంతం అని లేదు.
    2012 డిసెంబర్ 21 కి మాత్రం యుగాంతం జరగదు.
    -----ఇది దేవుని తరపున నా చాలెంజ్

    ReplyDelete