Sunday, November 15, 2009

Lunar water


నిన్ననో మొన్ననో.. నాసా వాళ్ళు నస పెడుతూ చెప్పారు.. చంద్రుని పైన నీటి నిక్షేపాలున్నాయని.. ఏదైనా విషయం గురించి ఇంటరాగేట్ చేస్తున్నట్టు మాట్లాడే నేను ఆ సమయంలో చుట్టూ ప్రక్కల జీవులెవరూ లేక నాతో నేనే మాట్లాడుకున్నాను..


ప్ర: చంద్రుని పై నీరుందంట.. విన్నావా?
స: సో వాట్, ఐతే ఏంటట (తెలుగులో)


ప్ర: అదేంటీ అలా అంటావ్, ఎన్నో ఏళ్ళ నుండి ఖగోళ శాస్త్రజ్ఞులందరూ ఎదురు చూస్తున్న విషయం కదా ఇదీ?
స: చూడూ ప్రపంచంలో వేస్టుగా పోతున్న డ్రైనేజీ నీళ్ళలో కనీసం పదో వంతైన ఉంటాయా అవి, అక్కడికెళ్ళి టీ తాగటానికి కూడా పనికి రావవి..
ప్ర: ఎందుకనీ?
స: చూడూ చంద్రుని పైన వాతావరణం లేదు.. దానికి కారణం సూర్యరశ్మి (సన్ రేస్) వలన చంద్రుని పైనున్న వాయువులకి అందించబడిన కైనెటిక్ ఎనర్జీ (చలన శక్తి లాంటిది), చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే బాగా ఎక్కువ.. ఇంకేముంటుంది, గొడవ పడ్డ పెళ్ళానికి చెప్పుకోవటం చేతకాని మొగుణ్ణి తన్ని పుట్టింటికి పారిపోయిన మనిషిలా... అక్కడ వాయు సమూహం అంతా చక్కగా విశ్వంలోకి చెక్కేసింది..


ప్ర: ఈ సోదంతా ఎందుకు చెబుతున్నావ్?
స: ఎందుకంటే అక్కడి నీళ్ళు వాడుకోవటానికి అనువుగా భావించబడ్డా, అది నిజమే ఐనా... వాటిని ఉదాహరణకి, వండుకోవటానికి వాడే ముందే ఆవిరైపోతాయి... ఉడికించే చర్య (బోయిలింగ్) జరగాలంటే అందుకు నీరు మరిగే వేడి కావాలి, భూమి మీద ఐతే వాతావరణ పీడనం (ఎట్మాస్పియరిక్ ప్రెజర్) ఉంది కాబట్టి, నీటి పైన వంద డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఇచ్చే వేడి ఇస్తే కానీ నీళ్ళు మరగవ్.. అంత ఉష్ణోగ్రతలోనే.. ఘన పదార్దాలు ఉడకటం జరుగుతుంది కాబట్టి... మన వాతావరణ పీడనం మనకెంతో సహాయ పడుతుంది.. చంద్రుని మీద వాతావరణ పీడనం అనే విషయమే లేదు కాబట్టి... అక్కడి మంచుని వేడి చేసిన మరుక్షణం అంతా ఆవిరైపోతుంది.. అప్పుడు ఆ నీటిని మొక్కలకి వేసినా.. దానితో వంటలు చేయాలనుకున్నా... వేస్టే.. 
ఇప్పుడే ఒక ఐడియా తట్టింది చెప్పనా.. హహహహహ

బియ్యం, పప్పు, సుగంధద్రవ్యాలన్నీ కలిపి తిని వాటితో పాటూ అక్కడ దొరికిన అపురూపమైన జలాన్ని సేవించి... నువ్వు వెళ్ళి స్టవ్ మీద కూర్చుంటే సరిపోతుంది..


ప్ర: ఏడిసినట్టుంది.. నువ్వెప్పుడూ నెగిటివ్‌గానే మాట్లాడతావ్, మన సైంటిష్టులేమన్నా అంత వెర్రివెంగలప్పలా, ఆమాత్రం ప్రత్యామ్నాయాలు కల్పించలేరా?
స: ఒరే అక్కుపక్షీ.. చంద్రుడి పై నీరు కనిపించింది కదా అని గాలి బుడగలు (సోఫిస్టికేటెడ్ లివింగ్ సిస్టం డివైడెడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల ఎఫెక్ట్స్) మద్యలో బతకటం స్టార్ట్ చేశావనుకో.. అది జీవితకాలం సాగదు.. దిన దిన ఘండం నూరేళ్ళాయుష్షనేటట్టుంది.. 
ఐనా మైండుకి పట్టే దురదొదలక నాసా వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు తెగ విషయాలు కనుక్కోవటంలో  బిజీ ఐపోతున్నారు కానీ.. అవే డబ్బుల్ని అంతే ఎఫర్టుని భూమి మీదుండే కాలుష్యాన్ని నివారించే దిశలో వాడి ఉంటే.. కనీసం జరగవలసిన డామేజీ ఎనభై శాతం వరకైనా తగ్గేదని నా అభిప్రాయం...


ప్ర: నీ బోడి అభిప్రాయాలు ఎవరికీ అక్కర్లేదు కానీ, చంద్రుడి మీదకి ట్రావెల్ చెయ్యటానికి ఎంత ఖర్చవుతుందంటావ్..?
స: నీలాంటోళ్ళకోసమే అనుకుంటా మన పెద్దలు సామెతలు తయారు చేసింది.. "పరుగెత్తి పాలు (మన విషయంలో చంద్రగ్రహపు నీళ్ళులే) తాగే కంటే నిలబడి నీళ్ళు త్రాగటం మంచిదని".


ప్ర: నిన్నెవరూ మార్చలేరేమో?.. నువ్విక్కడే తగలడు.. నేను అలా అలా ఆకాశంలో గిరికీలు కొడుతూ చంద్రున్ని చుట్టొస్తా..
స: ఛా!! నిజమా.. నీలాంటోడే  "వైఫూ స్టమక్కూ రెండూ లేవు, కానీ సన్ పేరు సండే లింగం" అన్నాడంట..





No comments:

Post a Comment