Tuesday, April 20, 2010

పుత్రోత్సాహము...

"పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,
జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.."

వ్యాఖ్యానం: సుమతీ శతకంలో బద్దెన అంటారూ.. నాయనా నీ గురించి మీ నాయనకి పక్కోడు చెబితే తప్ప నీ విషయంలో ఆయనకి సంతోషం రాదురా.. పుడుతూ పుడుతూ నలుగురు వందిమాదిగల్ని నీతో పాటు పట్టుకురా.. లేప్పోతే.. మీ నాన్న నీ గురించి ఎప్పుడూ సంతోషించడూ అని..


అసలు విషయాన్ని దాచేసి నాకు నచ్చింది తాత్పర్యంగా చెబుతున్నాననా మీ ఫీలింగు, ఔను మరి మూస పద్దతిలో తాత్పర్యం ఇదే అని చెప్పినంత మాత్రాన ఎలా ఒప్పుకుంటారు.. తనని ఎంతో ప్రేమించే తండ్రి, తన ప్రతిభ పైన చుట్టు ప్రక్కలవాళ్ళ కితాబు కోసం ఎందుకు ఎదురు చూస్తాడు.. ఆయన మైండు అంత వీక్ మైండా.. 
బద్దెన చెప్పింది ప్రపంచంలో ఎనభై శాతం మంది ఎలా వర్తిస్తారు అనేది.. కానీ ప్రపంచ గమన నిర్ధేశకత్వాన్ని మార్చేది ఆ మిగిలిన ఇరవై శాతం మంది అనేది.. శాస్త్రీయంగా విశదీకరించబడింది..
             అందుకే ప్రతి తండ్రీ ఆలోచించాల్సిందేంటంటే.. తన పిల్లలు ఫస్టు ర్యాంకర్‌తో పోటీ పడుతున్నారా లేదా అనేది కాదు.. కీ షీట్‌తో పోటీ పడుతున్నారా లేదా అనేది చూడాలి, తన పిల్లలు మిగిలిన వాళ్ళ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారా లేదా అని కాదు, తమ పిల్లల స్థానం కంటే ఉన్నత స్థానం ఉంద లేదా వాళ్ళు ఉన్నతంగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి.. You may say that best result is the output of rationale which is in turn the result of divisive or comparitive study.. but your fellow being is always a multi-dimensional variable with infinitismally low probability of consistency's expectency within him/her with whom an ideal rationale is not appropriately calculated.. so take infinite by you to meet the best.. but not a variable or constant, that's temporarily or permanantly fixed. Remember that the statement saying a variable equivalent to infinite is an absolute hallucination.

No comments:

Post a Comment